అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ, బీపీఈడీ ఆరో సెమిస్టర్ ఫలితాలను మంగళవారం వీసీ ప్రొఫెసర్ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్ విడుదల చేశారు. బీఈడీ కోర్సులో మొత్తం 727 మంది పరీక్ష రాయగా 688 మంది (94.64 శాతం), బీపీఈడీ కోర్సులో 54 మంది రాయగా 50 (92.59 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 30వ తేదీలోపు రీవాల్యుయేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.


