ప్రయాణం దారిద్య్రం.. నడకే నయం! | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం దారిద్య్రం.. నడకే నయం!

Jul 15 2026 1:34 AM | Updated on Jul 15 2026 1:34 AM

బుక్కరాయసముద్రం మండలం నీలారెడ్డిపల్లికి వెళ్లే రహదారి దుస్థితి

రోటరీపురంలో గుంతల్లో నిలిచిన నీళ్లు

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా పల్లెల ప్రగతిని పట్టించుకోవడంలేదు.. ప్రజా సంక్షేమం గాలికొదిలేశారు.. పల్లె ప్రయాణం ‘దారి’ద్య్రంగా ఉంది. అతుకులు,గతుకుల రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా ఉంది. శింగనమల నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నా.. పల్లెల్లో మురుగునీరు పారుతున్నా.. మోకాలు లోతు గుంతలు పడి ప్రయాణం నరకప్రాయంగా ఉన్నా.. కనీసం స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి పల్లెల వైపు కన్నెత్తి చూడడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న నీలారెడ్డిపల్లిలో 400 కుటుంబాలు, 2 వేల మంది వరకు జనాభా ఉన్నారు. గ్రామానికి నిర్మించిన తారు రోడ్లు శిథిలమయ్యాయి. ఈ గ్రామం మీదుగా వెంకటాపురం, చెన్నంపల్లి, నార్పల గ్రామాలకు వాహన రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలా నియోజకవర్గంలో అనేక గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు, వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది. ఎమ్మెల్యే ఇకనైనా ప్రజల కష్టాలను చూసి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

భద్రంపల్లి వద్ద గుంతలమయంగా రహదారి

కోటంకలో పారుతున్న మురుగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement