మాతాశిశు మరణాలు నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలు నివారిద్దాం

Jul 15 2026 1:34 AM | Updated on Jul 15 2026 1:34 AM

ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ ప్రసన్న భారతి

అనంతపురం సిటీ: జిల్లాలో మాతాశిశు మరణాలు పూర్తి స్థాయిలో నివారించేలా కృషి చేద్దామంటూ వైద్యాధికారులకు ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రసన్న భారతి పిలుపునిచ్చారు. గత నెల రోజుల్లో జిల్లాలో చోటు చేసుకున్న ఒక మాతృ, ఆరు శిశు మరణాలపై సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారులతో మంగళవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆమె సమీక్షించారు. మరణాలకు గల కారణాలపై ఆరా తీశారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు మరింత శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. గర్భస్థ సమయం నుంచి ప్రసవం వరకూ ఆరోగ్య సేవలు అందేలా చొరవ తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఎంఓ డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ డేవిడ్‌ సెల్వరాజ్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ గంగాధరరెడ్డి, జీజీహెచ్‌ గైనిక్‌ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్‌ శంషాద్‌ బేగం, అనస్థీషియా డాక్టర్‌ సోమశేఖర్‌, చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ నవీన్‌కుమార్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఐ.పద్మశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement