అనంతపురం అగ్రికల్చర్: సూక్ష్మ, చిన్నతరహా, మధ్యస్థ స్థాయి (మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైసెస్–ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల ఏర్పాటుకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రోత్సహిస్తుందని బ్యాంకు చీఫ్ మేనేజర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం స్థానిక జీసెస్‌నగర్‌లో పీఎం విశ్వకర్మ క్రెడిట్ ఆవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈ స్టేట్ నోడల్ ఆఫీసర్లు ఏ శీను, డి.వీరయ్య, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ఆనంద్, ఎల్‌డీఎం మారుతీశ్రీనివాస్, ఎస్‌బీఐ కార్డినేటర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తి అర్హత కలిగిన ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వ్యక్తిగతంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన రుణాలు అందజేస్తామన్నారు. సొంతంగా ఆర్థిక స్వావలంభన సాధించడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పన లక్ష్యంగా ఎంఎస్‌ఎంఈ కింద రుణాలు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 40 మంది లబ్ధిదారులకు రుణవితరణ మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ స్టాఫ్ మారుతి, సుధీర్, సునీత, ఎఫ్‌ఎల్‌సీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


