బాధ్యతగా పని చేయండి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా పని చేయండి

Jul 14 2026 1:18 AM | Updated on Jul 14 2026 1:18 AM

అనంతపురం న్యూటౌన్‌: విధి నిర్వహణలో బాధ్యతలెరిగి పనిచేసి, ప్రజా మన్ననలు పొందాలని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.విజయలక్ష్మి సూచించారు. జెడ్పీ చాంబర్‌లో సోమవారం జిల్లాకు కొత్తగా వచ్చిన డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు (డీడీఓ) గోరంట్ల నాగ శేషాచలారెడ్డి, షేక్‌ అమానుల్లా .. సీఈఓ విజయలక్ష్మి, డిప్యూటీ సీఈఓ మల్లికార్జునను మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త డీడీఓలనుద్దేశించి సీఈఓ మాట్లాడుతూ జిల్లా ప్రజలతో మమేకమై జిల్లా అఽబివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. జీఎన్‌ఎస్‌ రెడ్డి గుంతకల్లు డీడీఓగా బాధ్యలు చేపట్టనున్నారు. కళ్యాణదుర్గం డీడీఓగా నియమితులైన షేక్‌ అమానుల్లా కర్నూల్‌ జిల్లా గోస్పాడు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా పనిచేశారు. డీడీఓగా ప్రమోషన్‌పై అనంతపురం జిల్లాకు బదలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement