అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో (ఎస్‌ఐఆర్) తొలి అంకమైన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. సోమవారం నాటికి జిల్లావ్యాప్తంగా 18.13 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్) డిజిటలైజేషన్ చేశారు. ఇంకా ఈఎఫ్ ఇవ్వని వారు వెంటనే వాటిని బీఎల్‌ఓకి సమర్పించాలి. అలా ఇవ్వని పక్షంలో వారి ఓటు ఈనెల 21న ప్రచురించనున్న ముసాయిదా ఓటరు జాబితాలో ఉండదు.
● ఓటర్లకు ఎన్యుమరేషన్ పారాల పంపిణీ, స్వీకరణ ప్రక్రియ గత నెల 15న ప్రారంభించారు. జిల్లాలో 20,38,523 మంది ఓటర్లు ఉండగా 20,38,522 (100శాతం) మందికి ఈఎఫ్‌లు అందజేశారు. సోమవారం నాటికి 18,13,030 ఈఎఫ్‌లు (88.94 శాతం) డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 2,25,492 ఈఎఫ్‌లు డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది.
వెనక్కి తీసుకోని ఈఎఫ్‌లు 1.92 లక్షలు
జిల్లావ్యాప్తంగా 20,38,522 మంది ఓటర్లకు ఈఎఫ్‌లు అందించగా, ఇప్పటి వరకు 1,92,773 ఈఎఫ్‌లను ఓటర్ల నుంచి వెనక్కి తీసుకోలేదు. ఓటర్లు తమ ఈఎఫ్‌ను బీఎల్‌ఓలకు సమర్పించేందుకు, బీఎల్‌ఓలు వాటిని డిజిటలైజేషన్ చేసేందుకు మంగళవారం చివరి రోజైన నేపథ్యంలో ఓటర్లు త్వరపడాల్సిందే. ఓటరు తనకు సంబంధించిన 2002 నాటి వివరాలు అందించడం తప్పనిసరి కాదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరాలు లేవనే కారణంతో ఈఎఫ్‌ను ఓటర్లు తమ వద్ద ఉంచుకోకుండా ఉన్న సమా చారం పూరించి బీఎల్‌ఓకు అందజేయాల్సి ఉంది.


