మహిళపై అత్యాచారయత్నం | - | Sakshi
Sakshi News home page

మహిళపై అత్యాచారయత్నం

Apr 13 2026 8:02 AM | Updated on Apr 13 2026 8:02 AM

గుత్తి: పట్టణ పరిధికి చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల వివరాలమేరకు.. జడ్‌.వీరారెడ్డి కాలనీకి చెందిన లక్ష్మిదేవి పట్టణ శివారులోని డాబాలో పని ముగించుకుని శనివారం అర్ధరాత్రి ఒంట గంట సమయంలో ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె మెడలోని దారం చెవి కమ్మకు తగిలి చెవికు గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆరు కుట్లు వేశారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల బాధితురాలిని వెంట బెట్టుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సురేష్‌ .. జడ్‌.వీరారెడ్డి కాలనీకి వెళ్లి బాధితురాలిని కలిసి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. కాలనీ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు.

18న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆర్థిక–ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 18న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ బోధనేతర పనులు, సీపీఎస్‌ రద్దు, ఎంటీఎస్‌ ఉపాధ్యాయుల జీతాల సమస్య, ిపీఆర్సీ అమలు తదితర డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే నిరసనలకు దిగినట్లు పేర్కొన్నారు. సబ్‌ కమిటీ సభ్యులు గురురాజ, రామకృష్ణ, రంగనాయకులు, సూర్యనారాయణ, సుభద్ర, రాష్ట్ర కౌన్సిలర్లు శివారెడ్డి, ఎల్లప్ప, జె.వెంకటేశులు, నారాయణస్వామి, ఓబులేసు, హిమగిరి, అంజి, కలిముల్లా, తిప్పేస్వామి, శ్రీనివాసులు, బాలసుబ్రహ్మణ్యం, హనుమంతు, రంగానాయుడు పాల్గొన్నారు.

విద్యుత్‌ స్తంభాన్ని

ఢీకొన్న కారు

అగళి: కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని కసాపురం దగ్గర ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాలమేరకు.. హైదరాబాద్‌ నుంచి శిర వైపుగా వెళ్తోంది. అయితే మండలంలోని కసాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర కారు డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. దీంతో సమీపంలోని విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు మూగ గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనతో విద్యుత్‌ స్తంభం ధ్వంసమైన ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి, మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement