అనంతపురం అర్బన్: యూపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ నెల 12న (ఆదివారం) జరగనున్న ఫ్లాగ్‌షిప్ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందన్నారు. అభ్యర్థులు ఏదేని సమాచారం లేదా ఫిర్యాదు కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 85002 92992కు కాల్ చేయవచ్చని కలెక్టర్ తెలియజేశారు.


