రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన ఘనుడు చంద్రబాబు. హైకోర్టు, ఎయిమ్స్ తదితర ప్రాజెక్ట్‌లను ఇతర ప్రాంతానికి తరలించారు. రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు చిత్తశుద్ధి లేదు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పే వరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయని చాలా మందికి తెలియదు. ఇప్పటికై నా ఐక్య పోరాటంతోనే రాయలసీమ ప్రాజెక్ట్‌లను పరిరక్షించాలి.
– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే,
ధర్మవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త


