భూములు తీసుకుని రోడ్డున పడేస్తారా? | - | Sakshi
Sakshi News home page

భూములు తీసుకుని రోడ్డున పడేస్తారా?

Feb 24 2026 7:10 AM | Updated on Feb 24 2026 7:10 AM

భూముల

భూములు తీసుకుని రోడ్డున పడేస్తారా?

కలెక్టరేట్‌ ఎదుట రైతుల ఆందోళన

అనంతపురం అర్బన్‌: జీవనాధారమైన భూములను కార్గో విమానాశ్రయం ఏర్పాటుకు తీసుకుని తమను రోడ్డున పడేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని పలువురు రైతులు ప్రశ్నించారు. పంట భూములను విమానాశ్రయం ఏర్పాటుకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అనంతపురం రూరల్‌, ఆత్మకూరు, కూడేరు మండలాల రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. కార్గో విమానాశ్రయం ఏర్పాటుకు మూడు మండలాల పరిధిలోని చిన్నంపల్లి, కురుగుంట, తలుపూరు, సజ్జల కాలువ, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని పట్టా భూములను ఆర్‌డీఓ పరిశీలించారన్నారు. అయితే ఆయా భూముల్లో ఇప్పటికే రైతులు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఆ భూములను విమానాశ్రయానికి తీసుకుంటే జీవనాధారం కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. జిల్లాలో సాగుకు పనికిరాని బంజరు భూములను విమానాశ్రయానికి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు వెంకటప్ప, గురుకర్ణ రమేష్‌, వెంకటనారాయణ, చిన్న వెంకటనారాయణ, మల్లారెడ్డి బాలాంజనేయులు, నాగప్ప, కొండయ్య, నాగమ్మ, నాగమణి, వెంకటేషులు, నాగేశ్వరరావు, ఆనంద్‌, ప్రకాశరెడ్డి, మల్లారెడ్డి విజయలక్ష్మి, సంకేపల్లి మల్లారెడ్డి పాల్గొన్నారు.

పరిష్కార వేదికకు 123 వినతులు

అనంతపురం సెంట్రల్‌: జిల్లా పోలీసు కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 123 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్‌ స్వయంగా వినతలు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్యలను చట్టానికి లోబడి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారి అశ్విని మణిదీప్‌, మహిళా పీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

భూములు తీసుకుని రోడ్డున పడేస్తారా? 1
1/1

భూములు తీసుకుని రోడ్డున పడేస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement