సురక్షిత ప్రయాణమే లక్ష్యం : డీఆర్‌ఎం
గుంతకల్లు: ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే తమ ప్రథమ కర్తవ్యమని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా పేర్కొన్నారు. దాదాపు రూ.35 లక్షలతో ఓఎంఎస్ (ఆక్యూలేషన్ మారిటరింగ్ సిస్టం) కోచ్‌గా ఽఆధునీకరించిన జనరల్ బోగీని సోమవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో ఏడీఆర్‌ఎం సుధాకర్‌తో కలిసి డీఆర్‌ఎం ప్రారంభించి మాట్లాడారు. రైలు మార్గం నిర్వహణలో ఓఎంఎస్ కోచ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. రైలు కంబీల మధ్య వ్యత్యాసంతో పాటు రైళ్ల రాకపోక సమయంలో కదలికల్లో లోపాలు, లైన్ల పటిష్టత తదితర వాటిని గుర్తించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుదన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.
హంద్రీ–నీవా కాలువలో మహిళ మృతదేహం
వజ్రకరూరు: మండలంలోని రాగులపాడు సమీపంలో ఉన్న హంద్రీ–నీవా ఎత్తిపోతల ప్రాజెక్ట్ వద్ద కాలువలో సోమవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించారు. సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని, కాలువ ఉపరితలం నుంచి నీటి ప్రవాహం మృతదేహం కొట్టుకువచ్చినట్లుగా నిర్ధారించారు. మృతదేహాన్ని గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
హిజ్రాలకు గుర్తింపు కార్డుల జారీ
అనంతపురం అర్బన్: గుర్తింపుకార్డు, ధ్రువీకరణ పత్రం కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న హిజ్రాలకు సంబంధిత పత్రాలను సోమవారం కలెక్టర్ ఓ. ఆనంద్ అందజేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతుల మీదుగా అనంతపురానికి చెందిన ఎస్.శాంతి, కూడేరుకు చెందిన ఆధ్యా గుర్తింపు కార్డు, సర్టిఫికెట్ అందుకున్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, సిబ్బంది పాల్గొన్నారు.
హెల్మెట్ ధరించి
ఆలయంలో చోరీ
పుట్లూరు: మండలంలోని నారాయణరెడ్డిపల్లి సమీపంలో ఉన్న చౌడమ్మ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇద్దరు వ్యక్తులు హెల్మెట్, మాస్క్‌లు ధరించి తలుపులు ధ్వంసం చేసి ప్రవేశించారు. బీరువాల్లో ఉంచిన 10 తులాల వెండి వస్తువులు, రూ.3 వేలు నగదు అపహరించారు. ఉదయం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సీఐ సత్యబాబు, క్లూస్ టీం సభ్యలు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటుతో
ఆర్మీ జవాన్ మృతి
గార్లదిన్నె: జమ్మూ కాశ్మీర్‌లోని కరుకువాడ ఔట్ పోస్టులో 21వ ఆర్మీ బెటాలిన్ హవల్దార్‌గా పనిచేస్తున్న గార్లదిన్నెకు చెందిన నల్లప్ప, మునిరత్నమ్మ దంపతుల కుమారుడు నరేష్(37) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం విధులు నిర్వహిస్తున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆర్మీ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2010లో ఆర్మీలోకి చేరారు. పదేళ్ల క్రితం గుంతకల్లు మండలం నెలకొండకు చెందిన సునీతతో వివాహమైంది. విషయం తెలియగానే తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క కుమారుడి భౌతిక కాయం కోసం ఎదురు చూస్తున్నారు.
26న మెగా జాబ్ మేళా
రాయదుర్గం టౌన్: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 26న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వి.నరసింహారెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. పూర్తి వివరాల కోసం 78010 31771 లో సంప్రదించవచ్చు.
సురక్షిత ప్రయాణమే లక్ష్యం : డీఆర్‌ఎం
సురక్షిత ప్రయాణమే లక్ష్యం : డీఆర్‌ఎం


