అప్పలరాజుపై పీడీ యాక్ట్ ఎత్తివేయాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్
అనంతపురం టవర్‌క్లాక్: రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై చంద్రబాబు ప్రభుత్వం బనాయించిన పీడీయాక్ట్‌ను ఎత్తి వేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. గురువారం అనంతపురంలోని ఎన్జీఓ హోం లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల పక్షాన నిలిచి బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా అప్పలరాజు ఉద్యమాలు చేపడితే అతనిపై అక్రమంగా కేసులు బనాయించి పీడీ యాక్ట్ నమోదు చేయడం దారుణమన్నారు. ఇది పూర్తి కక్ష పూరితంగానే ప్రభుత్వం చేసిందన్నారు. తక్షణమే పీడీ యాక్ట్‌తో పాటు అక్రమ కేసులు ఎత్తి వేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయుడు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖరరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సూరి, సహాయ కార్యదర్శి రాము, నాయకులు వెంకీ, శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, గిరి, రాయుడు, కిష్ట, శ్రీనివాసరావు, రాజారాంరెడ్డి, కుళ్లాయప్ప, చెన్నారెడ్డి, వలి, జయమ్మ, సువర్ణ, వెంకట కొండయ్య, పోతలయ్య, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


