●పక్కనే ప్రమాదం.. ఇదేం గ్రహచారం!
కాస్త అప్రమత్తంగా లేకపోయినా కాళ్లు పట్టేస్తాయ్... నిలువెల్లా చీరేస్తాయ్.. ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని నిత్యం భయంభయంగా నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామంలోని హైస్కూల్లో కోతులు, శునకాల బెడద ఎక్కువైంది. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు సేదతీరుతున్నాయి. పిల్లలు ఎప్పుడైనా ఆదమరచి కాస్త వాటిపై కాలు వేసినా అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇక పాఠశాలలో కోతులు స్వైర విహారం చేస్తుండడంతో దినదిన గండంగా మారింది. వీటి కట్టడికి అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
●పక్కనే ప్రమాదం.. ఇదేం గ్రహచారం!
●పక్కనే ప్రమాదం.. ఇదేం గ్రహచారం!


