అనంతపురం: పోలీస్ శాఖలోని పలువురికి ఉగాది ఉత్తమ సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో జిల్లా స్పెషల్‌బ్రాంచ్ ఎస్‌ఐ జి.లోక్‌నాథ్ చౌదరి ఉగాది ఉత్తమ సేవా పతకం దక్కింది. 1990లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరిన ఆయనకు 2011లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 2024లో ఎస్‌ఐగా పదోన్నతి దక్కింది. 2015లో సేవా పురస్కారం పొందారు. 2017లో ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. తాజాగా ఉగాది ఉత్తమ సేవా పురస్కారానికి ప్రభుత్వం ఆయనను ఎంపిక చేసింది. అలాగే 14వ బెటాలియన్‌కు చెందిన ఏఆర్ ఎస్‌ఐ వీసీఎస్ మహారాజు హెడ్ కానిస్టేబుల్ వి.నారాయణ స్వామికు ఉత్తమ సేవా పతకం దక్కింది. స్పెషల్ బ్రాంచ్ సీఐగా ఉన్న జె.ధరణికిషోర్, ఇటుకలపల్లి సీఐ జె.హేమంత్‌కుమార్, ఏఆర్ ఎస్‌ఐ సీహెచ్ నాగేశ్వర రావు, పుట్లూరు, ఏఎస్‌ఐ పి.రాజశేఖర్, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ ఎ.నాగరాజు, కళ్యాణదుర్గం పీఎస్ హెడ్‌కానిస్టేబుల్ ఎం. హరినాథ బాబు, అనంతపురం రూరల్ పీఎస్ కానిస్టేబుల్ ఎస్.టిప్పుసుల్తాన్, ఉరవకొండ పీఎస్ కానిస్టేబుల్ ఎం.చంద్రశేఖర్, ఏపీఆర్‌సీ సి.రాముడు, స్పెషల్‌బ్రాంచ్ కానిస్టేబుల్ ఎ.ప్రసన్న కుమార్‌కు సేవా పతకాలు దక్కాయి.


