షాడో నీడలో గాడి తప్పిన పాలన | - | Sakshi
Sakshi News home page

షాడో నీడలో గాడి తప్పిన పాలన

Jan 2 2026 11:18 AM | Updated on Jan 2 2026 11:18 AM

షాడో నీడలో గాడి తప్పిన పాలన

షాడో నీడలో గాడి తప్పిన పాలన

నిర్వీర్యం దిశగా నగర పాలక సంస్థ

తీవ్రమైన ‘షాడో’ వేధింపులు

సీపీఓ లాంగ్‌ లీవ్‌.. టీపీఎస్‌ సరెండర్‌

అనంతపురం క్రైం: నగర పాలక సంస్థలో ‘షాడో’ పెత్తనం రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘షాడో’ ఆదేశాలే కీలకంగా మారాయని, ఆయన చెప్పిన మాటే చెల్లుబాటవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. షాడో వేధింపులతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మెల్లిమెల్లిగా ఖాళీ అవుతోంది. ఈ క్రమంలో అక్రమాలు పెరిగి వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

వసూళ్లకు లైన్‌ క్లియర్‌!

నగరపాలక టీపీఓగా మళ్లీ శిరీష చేతికి పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. టీపీఓ నీరజాక్షి లాంగ్‌ లీవ్‌పై వెళ్లడంతో అధికార పార్టీ ప్లాన్‌ బాగా వర్కవుట్‌ అయింది. దీంతో వసూళ్లకు లైన్‌ క్లియర్‌ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అక్రమ నిర్మాణాలు, అనుమతులు, మార్పిడి ఫైళ్ల చుట్టూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు సంస్థ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులైనా స్పందించి పాలనను గాడిలో పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.

వారిపై విజి‘లెన్స్‌’.. !

మరోవైపు ఇష్టారాజ్యంగా పనులు చేసుకున్న కాంట్రాక్లర్లు, అక్రమ సంపాదన కోసం దిగజారి ఫైళ్లపై సంతకాలు చేసిన అధికారుల జాబితా విజిలెన్స్‌ అధికారులు సిద్ధం చేశారని తెలిసింది. నెల రోజులుగా అంతర్గత విచారణ చేపట్టిన విజిలెన్స్‌ ఎట్టకేలకు ఓ ‘బలమైన నివేదిక’ను ప్రభుత్వ పెద్దలకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నగర పాలక సంస్థలో ‘షాడో’ కనుసన్నల్లో సాగుతున్న దందాపై ఇటు నిఘా వర్గాలు కూడా నివేదికను సిద్ధం చేసి పంపినట్లు తెలిసింది. కొంత మంది కీలక విభాగాల అధికారుల పేర్లు చేర్చినట్లు సమాచారం. నగర పాలక సంస్థ కార్యాలయాన్ని వదలకుండా పాతుకు పోయిన వారు కొందరైతే.. నేరుగా కాంట్రాక్టర్లను బినామీలుగా చేసుకుని కొన్నేళ్లుగా ఫోన్‌పేలలో లావాదేవీలు నడిపారు. వారి కుటుంబ సభ్యులు, భార్యలు, పిల్లల ఖాతాలకు ఫోన్‌ ఫేలో డబ్బు బదిలీ చేయించుకున్నారు. ప్రధానంగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కోర్టు రోడ్డులోని ఓ కాంప్లెక్స్‌ నిర్మాణంతో పాటు నరసింహులు అనే వ్యక్తికి చెందిన ఓ అపార్టుమెంటు నిర్మాణం విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లుగా ‘విజిలెన్స్‌’ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. నిత్యం ప్రజాప్రతినిధితో ఉద్యోగులు, అధికారులు నడిపిన రాయ‘బేరాల’పై కూడా కూపీ లాగినట్లు సమాచారం. మొత్తంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం నివేదికలో ఆరుగురు ఉద్యోగుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో సహా వివరాలు ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement