ఇసుక డబ్బు ఎక్కువై జనాలపై పడుతున్నారు
సాక్షి టాస్క్‌ఫోర్క్ : టీడీపీ నాయకులకు ఇసుక డబ్బులు ఎక్కువై జనాలపై పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజనాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన యల్లనూరులో టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్‌రెడ్డిని వెన్నపూసపల్లిలో పరామర్శించారు. అలాగే యల్లనూరు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై పుట్లూరు సీఐ సత్యబాబు, బుక్కరాయ సముద్రం సీఐ లక్ష్మయ్య, యల్లనూరు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డితో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ యల్లనూరు లో ఉదయం జరిగిన ఘటన చాలా ఘోరమన్నారు. ఓ సినిమా సీన్‌లా ఉందన్నారు. జెడ్పీటీసీ భోగతి ప్రతాప్‌రెడ్డి సౌమ్యుడని, అలాంటి వ్యక్తిపై దాడి చేయడం బాధాకరమని అన్నారు. యల్లనూరులో టీడీపీ వారికి ఇసుక డబ్బులు ఎక్కువై.. ఎలా ఖర్చు చేయాలో అర్థం కాక జనాలపై పడుతున్నారని విమర్శించారు. సంక్రాంతి తర్వాత ఇసుక రీచ్‌ల వద్ద ఆందోళన చేపట్టి మూసివేయిస్తామన్నారు.
ప్రజాస్వామ్యం ఖూనీ..
చంద్రబాబు ప్రభుత్వంలో చాలా నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఆర్‌ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి అన్నారు. ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనుదుల రమేష్‌రెడ్డితో కలసి జెడ్పీటీసీ భోగతి ప్రతాప్‌రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పినా పోలీసులు నోరు మెదపడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తే తమ నాయకుడు ఎవ్వరినీ వదలరని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబరు (ఎస్‌ఈసీ) భోగతి నారాయణరెడ్డి, జిల్లా కార్యదర్శి విష్ణునారాయణ, శింగనమల, బుక్కరాయసముద్రం మండల కన్వీనర్లు పూల ప్రసాద్, శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు భోగతి దిలీప్‌రెడ్డి, భోగతి నాగేశ్వరరెడ్డి, రామ్మోహన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భోగతి ప్రతాప్‌రెడ్డిని పరామర్శిస్తున్న ఆలూరు సాంబశివారెడ్డి, రమేష్‌రెడ్డి
పుట్లూరు సీఐ సత్యబాబుతో మాట్లాడుతున్న మాజీ మంత్రి సాకే శైలజనాథ్
సంక్రాంతి తర్వాత
ఇసుక రీచ్‌ల వద్ద ఆందోళన
మాజీ మంత్రి శైలజనాథ్ ధ్వజం
చంద్రబాబు ప్రభుత్వంలో
పెరిగిన నేరాలు, ఘోరాలు :
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‘ఆలూరు’ మండిపాటు
ఇసుక డబ్బు ఎక్కువై జనాలపై పడుతున్నారు


