జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం అర్బన్: ‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా నూతన సంవత్సరంలో ముందుకు సాగుదాం’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ జిల్లా అధికారులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్‌రహర్‌కు డీఆర్‌ఓ ఎ.మలోల, పరిపాలనాధికారి అలెగ్జాండర్ తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్ ఇలా విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అధికారి, ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సరం క్యాలెండర్, డైరీని, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం, హాస్టల్ వెల్ఫేర్ అధికారుల సంఘం, యునైటెడ్ టీచర్స్ యూనియన్, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.


