రెండేళ్ల క్రితం మా గ్రామంలోని జగనన్న కాలనీలో (సర్వే నంబర్ 483/4) నా భార్య గొల్ల కవిత పేరున ప్లాట్ నంబరు 15 మంజూరు చేస్తూ పట్టా (ఏఎన్‌ఏ01934178) ఇచ్చారు. అయితే, ఆ ప్లాట్‌లో వేరొకరు దౌర్జన్యంగా బండలు నాటుకున్నారు. సమస్యను గ్రామ సర్పంచుకు చెప్పినా.. సచివాలయంలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు.
– గొల్ల తిరుపాలు, బొమ్మలాటపల్లి, బుక్కరాయసముద్రం మండలం
పట్టించుకోవడం లేదు
యర్రగుంట పొలం సర్వే నంబరు 380–7 లో ఎకరా, 380–6లో 36 సెంట్లు మొత్తం 1.36 ఎకరాలు సాగు చేసుకుంటున్నా. ఈ భూమికి ప్రభుత్వం 2004లో డి.పట్టా, పాసుపుస్తకం మంజూరు చేసింది. భూమిలో బోరు వేసుకుని పంట సాగు చేసుకుంటున్నా. అయితే వెబ్‌ల్యాండ్‌లో మిగులు భూమిగా నమోదు చేశారు. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలు సమర్పించి నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
– జి.ప్రసాద్, బండమీదపల్లి,
రాప్తాడు మండలం
దౌర్జన్యంగా బండలు నాటారు


