సినీ నటి విద్య హత్య | - | Sakshi
Sakshi News home page

సినీ నటి విద్య హత్య

May 22 2024 4:30 AM | Updated on May 22 2024 11:30 AM

-

 సుత్తితో బాదిన భర్త నందీష్‌

 మైసూరులో దుర్ఘటన

మైసూరు (కర్ణాటక): రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట సంచలనాత్మక నేరాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి యువతులు, మహిళల హత్యలు కలకలం రేపుతున్నాయి. అదే కోవలో కుటుంబ కలహాలతో భర్త చేతిలో చలన చిత్ర నటి, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విద్యా నందీష్‌ దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన మైసూరు జిల్లా బన్నూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలు.. నందీశ్‌తో 2018లో విద్యకు వివాహం జరిగింది. కొంతకాలానికే గొడవలు మొదలై విడాకుల వరకూ వెళ్లారు. పెద్దల రాజీ పంచాయితీ, మంచి మాటల కారణంగా మళ్లీ ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం విద్యా మైసూరులోని శ్రీరాంపురకు వెళ్లారు. ఆ రాత్రి భర్త నందీష్‌తో ఫోన్‌లోనే గొడవ పడ్డారు. కోపంతో నందీష్‌ సుత్తి తీసుకుని విద్యా తలపై తీవ్రంగా కొట్టడంతో మృత్యువాత పడింది. నందీష్‌ పారిపోయాడు.

సినీ నటిగా పేరు
సినిమా, రాజకీయాల్లో పేరుమోసిన ఓ సెలబ్రిటిగా విద్యకు ఖ్యాతిగాంచింది. హీరో శివరాజ్‌కుమార్‌ నటించిన భజరంగి, చిరంజీవి సర్జా నటించిన అజిత్‌ చిత్రంలో స్నేహితురాలి పాత్రలో నటించారు. పలు సహాయక పాత్రలను కూడా పోషించారు. రాజకీయాల్లో కాంగ్రెస్‌ మైసూరు నగర ప్రధాన కార్యదర్శిగా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

పరారీలో భర్త
విషయం తెలిసి మైసూరు జిల్లా ఎస్పీ సీమా లాట్కర్‌, అదనపు ఎస్పీ నందిని తదితరులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బన్నూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నందీష్‌ కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement