ఏసీబీ వలలో సబ్‌ రిజిస్ట్రార్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సబ్‌ రిజిస్ట్రార్‌

Nov 23 2023 12:50 AM | Updated on Nov 23 2023 8:54 AM

- - Sakshi

పుట్టపర్తి: బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస నాయక్‌ రూ. 10 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి, సీఐ శాంతిలాల్‌ ప్రభాకర్‌ తెలిపిన మేరకు.. పుట్టపర్తి టౌన్‌ పరిధిలోని బ్రాహ్మణ పల్లికి చెందిన సురేంద్రరెడ్డి తన సోదరులతో పాటుగా ఉన్న ఉమ్మడి ఆస్తిలో తన వంతు భాగాన్ని రిజిస్టర్‌ చేయించుకోవాలని సబ్‌ రిజిస్ట్రార్‌ను ఆశ్రయించాడు.

స్టాంప్‌ డ్యూటీ తగ్గించుకుంటామని, తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని సబ్‌ రిజిస్ట్రార్‌ డీల్‌ కుదుర్చుకున్నాడు. బుధవారం రాత్రి సురేంద్రరెడ్డి అడ్వాన్స్‌గా సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ నాయక్‌కు రూ.10 వేలు, అతని భార్యకు రూ.10 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement