పెళ్లి కాలేదన్న దిగులుతో యువకుడి ఆత్మహత్య

అనంతపురం: పెళ్లి కాలేదన్న దిగాలుతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిసిన మేరకు... పెద్ద పప్పూరు మండలం చిన్నయక్కలూరు గ్రామానికి చెందిన చలపతి (25) తల్లితో కలసి జీవిస్తున్నాడు. పోలియో కారణంగా ఓ చెయ్యి పనిచేయకుండా పోయింది. చిన్నాచితక పనులతో కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఇటీవల చలపతికి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అయితే వైకల్యం కారణంగా పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీనికి తోడు ఇటీవల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఇక తనకు పెళ్లి కాదంటూ బంధువులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆత్మనూన్యతకు లోనై శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ అక్కడకు చేరుకుని చలపతి మృతిపై ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వార్తలు :