ఏయూలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ | - | Sakshi
Sakshi News home page

ఏయూలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

విశాఖ విద్య: భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. తొలుత ఏయూ పరిపాలనా భవనం వద్దకు చేరుకున్న ఆయనకు వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరిపాలనా భవనం వద్ద విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అక్కడే మొక్క నాటారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య పులిపాటి కింగ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు, ప్రిన్సిపాళ్లు, పాలక మండలి సభ్యులు, డీన్లు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్‌ కె.రామస్వామి ఎండోమెంట్‌ లెక్చర్‌ను రామ్‌నాథ్‌ కోవింద్‌ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement