43 అడుగుల గరుత్మంతుడు ● కొత్త శంఖు చక్రాల ఏర్పాటు
రూపుదిద్దుకుంటున్న గరుత్మంతుడి విగ్రహం
శ్రీవారి కొండపై ఏర్పాటు చేసిన శంఖుచక్రాలు
కొమ్మాది: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన రుషికొండపై 43 అడుగుల గరుత్మంతుడి విగ్రహ నిర్మాణం తుది దశకు చేరుకుంది. మెట్ల మార్గానికి, రోడ్డు మార్గానికి మధ్య ఉన్న కొండ పైభాగాన ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే తుది దశ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ విగ్రహం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. గతంలో ఈ కొండపై ఏర్పాటు చేసిన శంఖు, చక్ర, నామాలు తుఫాన్ ధాటికి దెబ్బతిన్నాయి. దీంతో అదేస్థానంలో కొత్త శంఖు, చక్ర, నామాలను ఏర్పాటు చేశారు. దీంతో శ్రీవారి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది.


