కాలినడకన శబరిమలకు | - | Sakshi
Sakshi News home page

కాలినడకన శబరిమలకు

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

పెదపాడు నుండి కాలినడకన శబరిమల యాత్ర ప్రారంభించిన ఇద్దరు అయ్యప్ప భక్తులు

అచ్యుతాపురం రూరల్‌ : మండలంలోని పెదపాడు గ్రామానికి చెందిన ఇద్దరు అయ్యప్ప స్వాములు శనివారం కాలినడకన శబరిమల యాత్రకు బయలుదేరారు. బుదిరెడ్డి నరేంద్ర, జనపరెడ్డి జగదీశ్‌ కలిసి అయ్యప్ప దీక్ష చేపట్టి స్వామి దర్శనానికి పాదయాత్ర ప్రారంభించారు. గత ఏడాది కూడా నరేంద్ర అయ్యప్ప మాల ధరించి 40 రోజుల్లో కాలినడకన శబరిమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మరోసారి పాదయాత్ర చేపట్టడం విశేషం. యాత్ర ప్రారంభం సందర్భంగా పెదపాడు అయ్యప్ప పీఠంలో స్వాములు వారిని ఘనంగా సన్మానించి గ్రామ పొలిమేర వరకూ సాగనంపారు. వారి శబరిమల యాత్ర విజయవంతంగా సాగాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అయ్యప్ప స్వామిని ప్రార్ధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement