విశాఖలో జాతీయ స్థాయి స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సదస్సు | - | Sakshi
Sakshi News home page

విశాఖలో జాతీయ స్థాయి స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సదస్సు

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

బీచ్‌రోడ్డు: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా జాతీయ స్థాయి స్పీచ్‌, లాంగ్వేజ్‌ అండ్‌ హియరింగ్‌ సదస్సు విశాఖలో నిర్వహించనున్నట్లు ఇండియన్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ హియరింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సంజయ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఆడియాలజిస్టిస్‌ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్టిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జనవరి 29 నుంచి 31 వరకు మూడు రోజులపాటు 58వ ఇషాకాన్‌ వార్షిక సమావేశం జరగనుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, పొరుగు దేశాల నుంచి 1,200 మందికి పైగా నిపుణులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఆధునిక వైద్య విధానాలు, పరిశోధనలపై చర్చలతో పాటు యువ నిపుణుల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రిలో సదస్సు వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో అసొసియేషన్‌ కార్యదర్శి డాక్టర్‌ నోరి, ఎలక్టివ్‌ అధ్యక్షడు గోస్వామి, ఏపీ అసోసియేషన్‌ అధ్యక్షులు శిరీష, ఇషాకాన్‌–2027 ఆర్గనైజింగ్‌ కమిటీ కార్యదర్శి లక్ష్మి గోదావర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement