ఉరేసుకుని కూలీ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని కూలీ ఆత్మహత్య

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

నాతవరం: మండలంలో ఎస్‌.బి.పట్నం గ్రామానికి చెందిన అంబంటి లోవ వెంకటేష్‌ (44) శనివారం తన ఇంట్లో ఫ్యాను రింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ వై. తారకేశ్వరరావు వివరాల మేరకు.. కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న లోవ వెంకటేష్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. గతంలోనే భర్తను వదిలేసి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. మృతుడికి మద్యం సేవించే అలవాటు ఉంది. శనివారం మధ్యాహ్నం తన ఇంటి వద్ద ఎవ్వరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌ రింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement