సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Nov 4 2026 1:50 AM | Updated on Nov 4 2026 1:50 AM

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ నరసింహారావు

తుమ్మపాల : ఈ నెల 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణపై అనకాపల్లి సబ్‌ డివిజన్‌ డీఎస్పీ పి.వి.వి.నరసింహారావు మంగళవారం సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించారు. మాకవరం, తుమ్మపాల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు, సీసీటీవీ నిఘా, ఓటర్ల ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు, ఇతర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు నిఘా పటిష్టం చేయడం, రౌడీషీటర్లు, గతంలో ఎన్నికల సంబంధిత కేసుల్లో ఉన్న వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఇన్‌స్పెక్టర్లకు సూచించారు. ఈ తనిఖీల్లో అనకాపల్లి రూరల్‌ ఎస్‌ఐ జి.రవికుమార్‌, టౌన్‌ ఎస్‌ఐ భాస్కరరావు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement