అర్ధంతరంగా బీసీ హాస్టళ్ల మూసివేత దారుణం | - | Sakshi
Sakshi News home page

అర్ధంతరంగా బీసీ హాస్టళ్ల మూసివేత దారుణం

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

● తక్షణమే పునఃప్రారంభించాలి ● ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్‌

తుమ్మపాల : విద్యా సంవత్సరం మధ్యలో జిల్లాలో 4 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేయడం పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే చర్య అని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వసతిగృహాల మూసివేతను నిరసిస్తూ మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టి, ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫణీంద్ర కుమార్‌ మాట్లాడుతూ.. 2026–27 విద్యా సంవత్సరం మధ్యలో వి.మాడుగుల, వడ్డాది, గొడిచెర్ల, పెద్దూరిరత్నాయపేటలోని 4 బీసీ వసతి గృహాలను ఆకస్మికంగా మూసివేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఇతర పాఠశాలల్లో చేరే అవకాశం లేక, వసతి సౌకర్యం కోల్పోయి చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. హాస్టళ్ల మూసివేతతో పలువురు విద్యార్థులు చదువులు మానేసి ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, వాటిని మూసివేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు నాలుగు హాస్టళ్లను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి అధికారుల, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు ధనుష్‌, నాగదుర్గ, శ్రీను, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement