ప్రభుత్వ స్కూళ్లు మరింత ప్రగతి సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లు మరింత ప్రగతి సాధించాలి

Nov 11 2026 1:07 AM | Updated on Nov 11 2026 1:07 AM

● విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంపొందించాలి ● జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆదేశం

దేవరాపల్లి : ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత నమ్మకం పెంచేలా పాఠశాలల ప్రగతి ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్‌. నాగేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని వేచలం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌ఏ–1(సమ్మెట్‌ అసెస్మెంట్‌) పరీక్ష విధానాన్ని ఆయన పర్యవేక్షించారు. అదే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సైతం సందర్శించి విద్యార్థులతో మాట్లాడి పలు అంశాలపై ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, స్థానిక విద్యార్థినీ విద్యార్థులతో కలసి కిందనే కూర్చొని భోజనం చేశారు. భోజనం రుచిగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం రుచికరంగా ఉండాలని, భోజనం నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పరిసరాలను వెంటనే పరిశుభ్రం చేయాలని స్థానిక ఉపాధ్యాయులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఉపాధ్యాయులకు డీఈవో సూచించారు. గ్రామాల్లో బడి ఈడు కలిగిన పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని డీఈవో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement