అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా బుధవారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ తుహిన్ సిన్హా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆజాద్ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, విద్యావేత్తగా విశేష సేవలందించారని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రత, మత సామరస్యం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, డీఎస్పీలు వి.బాబ్జీరావు, డి.శ్రీహరిరాజు, సీఐలు బాలసూర్యారావు, టి.లక్ష్మి, సతీష్‌కుమార్, సురేష్, ఎస్‌ఐలు, తదితరులు పాల్గొన్నారు.


