తాండవలో పెరుగుతున్న నీటి మట్టం | - | Sakshi
Sakshi News home page

తాండవలో పెరుగుతున్న నీటి మట్టం

Nov 12 2026 12:25 AM | Updated on Nov 12 2026 12:25 AM

నాతవరం: జిల్లాలోని ఏకై క మేజర్‌ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. బుధవారం సాయంత్రానికి నీటి మట్టం 375.5 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ కోసం ఆగస్టు 10న తాండవ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టులో నీటి మట్టం 374.5 అడుగులు ఉంది. అయితే నీటి విడుదల అనంతరం వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో ఆయకట్టుదారులతో పాటు అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో తాండవ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. మరోవైపు పంట కాలువల ద్వారా ఆయకట్టుకు రోజుకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ప్రాజెక్టులో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement