బీసీలపై చంద్రబాబుది కపట ప్రేమ. 34 శాతం రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని తెలిసే కోర్టులో పిటిషన్ వేిశారు. ఎన్నికల్లో బీసీలకు బూటకపు వాగ్దానం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను మోసం చేయాలని ప్రయత్నించి భంగపడ్డారు. జీవోలు ఇచ్చి బీసీలను మోసం చేసి సంబరాలు జరుపుకొన్నారు. తప్పును న్యాయంస్థానంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలంతా ఇది గ్రహించాలి. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
–యలమంచిలి చందు, బీసీ సెల్ నాయకుడు, నక్కపల్లి


