బాబు కపట నాటకం తేటతెల్లం | - | Sakshi
Sakshi News home page

బాబు కపట నాటకం తేటతెల్లం

Oct 2 2026 12:40 AM | Updated on Oct 2 2026 12:40 AM

ప్రజల్ని మోసం చెయ్యడంలో చంద్రబాబు దిట్ట. రాజ్యాంగం మేరకు యాభై శాతం దాటి రిజర్వేషన్లు ఉండరాదు. కోర్టు 34 శాతం బీసీ రిజర్వేషన్లు కొట్టేస్తుందని తెలిసి కూడా కావాలని జీవో ఇచ్చారు. బీసీలకు న్యాయం చెయ్యడంలో నాటి సీఎంలు జగన్‌, వైఎస్సార్‌లు ముందుండే వారు.స్థానిక ఎన్నికల వేళ బీసీల పట్ల కపట ప్రేమ నటిస్తూ బాబు రాజకీయం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రజలు కళ్లు తెరవాలి. నిజాయితీగా పాలించే వారెవరో గుర్తించాలి.

–పల్లె అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

బీసీలకు చట్టపరమైన పరిష్కారం కావాలి

బీసీలకు చట్టపరమైన పరిష్కారం కావాలి. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోలు న్యాయపరంగా నిలబడవని కూటమి ప్రభుత్వానికి ముందే తెలుసు. అయినా రాజకీయ ప్రయోజనాల కోసం హామీ ఇచ్చి బీసీలను మోసం చేసింది కూటమి ప్రభుత్వం. రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది. కోర్టు తీర్పు ఎలా ఉన్నా బీసీల రాజకీయ, సామాజిక సాధికారత, బీసీలకు దక్సాల్సిన వాటా విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదు.

– అప్పికొండ శ్రీను, దొండపూడి వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు, రావికమతం మండలం

జయహో బీసీ ...అంటూ హంగామా చేసిన చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ 34 శాతం బీసీ రిజర్వేషన్లు అంటూ మభ్యపెట్టారు. కోర్టులో రిజర్వేషన్ల పెంపు అంశం నిలబడదని చంద్రబాబుకు తెలిసే కంటి తుడుపు చర్యగా 34 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో తీసుకువచ్చారు. బీసీలందరూ ఇప్పటికై నా ఈ డ్రామాలను గ్రహించాలి. మహానేత వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి మా శిష్ట కరణాల కులాన్ని బీసీ జాబితాలో చేర్చి ఎంతో మేలు చేశారు.

–డబ్బీరు కామేశ్వరరావు, దిమిలి, శిష్ట కరణాలు సంఘం నాయకుడు

బాబు పొలిటికల్‌ డ్రామా

సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని చాలా సార్లు స్పష్టమైంది. 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని జీవోలు జారీ చేయడం పెద్ద పొలిటికల్‌ డ్రామా ఇది బీసీలపై ప్రేమతో చేసింది కాదు. మేం ఇవ్వాలనుకున్నాం కానీ కోర్టులే కొట్టేసాయి అని నెపం న్యాయస్థానాలపైకి నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. జీవోల పేరుతో కూటమి ప్రభుత్వం బీసీలను మరోసారి మోసగించింది. బీసీ కులాల ప్రజలంతా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.

–ఉద్దండం త్రినాధరావు,

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి

బీసీలకు మరోసారి అన్యాయం

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి, ఇప్పుడు కోర్టు తీర్పును సాకుగా చూపడం బీసీలను మోసం చేయడమే. బీసీలకు నిజంగా న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బీసీల ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

– నోట్ల శేఖర్‌, బట్లపూడి గ్రామం, అనకాపల్లి మండలం.

మాజీ డైరెక్టర్‌, రాష్ట్ర బీసీ యాదవ కార్పొరేషన్‌

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement