బీసీలపై చంద్రబాబు వైఖరి మొదటి నుంచి మోసపూరితమే. అమలు సాద్యం కాని జీవోలు, హామీలు ఇవ్వడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తన చేతకాని తనాన్ని ప్రతిపక్షాలు, న్యాయస్థానాలపై నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ బీసీలంతా చంద్రబాబు కపట ప్రేమను గమనిస్తున్నారు. 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదని చంద్రబాబుకు తెలిసే జీవోలు ఇచ్చారు. దీని ద్వారా స్థానిక ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూశారు. కోర్టు మొట్టికాయ వేసింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.
–ఎల్లేటి సత్తిబాబు, చేనేత కార్మిక సంఘ నాయకుడు, నక్కపల్లి


