కోర్టులో నిలవదని తెలిసి కూడా బీసీలను మోసం చేసేందుకు, రాజకీయ ప్రయోజనాల కొరకు కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు జీవోను ఇచ్చింది. గతంలో మాజీ సీఎం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇస్తే తన మనుషులతో అప్పట్లో సీఎం చంద్రబాబు కోర్టులో కేసు వేయించి అడ్డుకున్నారు. నిజంగా చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నందున చట్టం చేస్తే బాగుంటుంది. లీగల్ సమస్యలు వస్తాయని తెలిసినా కూటమి ప్రభుత్వం బీసీలను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేసింది. కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంప పెట్టు. చివరకు ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. చట్టపరమైన నిబంధనలను పాటించకుండా జీవోలు ఇచ్చి బీసీ సామాజికవర్గానికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది.ఇప్పటికై నా బీసీలను మభ్యపెట్టే ఆలోచన విరమించుకోవాలి.
– పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే, నర్సీపట్నం
హైకోర్టు తీర్పు చెంపపెట్టు
బీసీల రిజర్వేషన్ 34 శాతం పెంచుతున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు. ఇటువంటి రిజర్వేషన్ అమలు కాదని తెలిసి ప్రభుత్వం నాటకాలు ఆడింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఇది తేటతెల్లం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలను మభ్య పెట్టాలని చూశారు. అది కోర్టు తీర్పుతో పారలేదు.
–ఆళ్ల జగదీష్, వైఎస్సార్‌సీపీ మండల కార్యదర్శి, బీసీ వర్గం, వెదురుపర్తి (కశింకోట)
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు కనిపిస్తారా ?
చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే కేవలం బీసీలు గుర్తువస్తారా..? బీసీలను మభ్య పెట్టేందుకు చంద్రబాబు వారికి రిజర్వేషన్లు పెంచుతున్నట్టు జీవోలను విడుదల చేశారు. పెంచిన రిజర్వేషన్లు బీసీలకు వర్తించవని ఆయనకి తెలిసీ ఇటువంటి జీవోలను ఇవ్వడం బీసీ వర్గాల వారిని మభ్యపెట్టడమే. –ఆదిరెడ్డి రామునాయుడు, బీసీ నాయకుడు,
మాజీ సర్పంచ్, దాలివలస, కె.కోటపాడు మండలం
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో 34 శాతం సీట్లు బీసీలకు కేటాయించాలని ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. దానిని చట్టసభల్లో ఆమోదించకుండా బీసీలపై సవతితల్లి ప్రేమ నటిస్తుంది. రాజకీయాల్లో బీసీలను ఎదగదీయకుండా టీడీపీ ప్రభుత్వం కుట్రలో భాగమే ఈ ప్రయత్నం. రిజర్వేషన్లు పెంచడం వీలుకాదని తెలిసినప్పటికీ బీసీ కులాలపై ప్రేమ ఉన్నట్లు బయటకు చెప్పుకోవడానికి హైకోర్టును ఆశ్రయించింది. బీసీలకు రిరజ్వేషన్లు పెంచాలనే కృత నిశ్చయం ఉన్నట్టయితే చట్టసభల్లో ఆమోదం చేయాలి.
– భీశెట్టి గంగప్పలనాయుడు, బీసీ నాయకుడు, మూలపేట, (మునగపాక మండలం)
బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల విషయంలో ముమ్మాటికీ చంద్రబాబుది మోసమే. చిత్తశుద్ధి లేదు. అమలు సాధ్యం కాని జీవోలు ఇచ్చి తప్పును న్యాయం స్థానంపైకి నెట్టేందుకు ప్రయత్నించారు. బీసీలంతా గమనిస్తున్నారు. మొదటినుంచి బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపే. కోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెప్పు దెబ్బ. తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలి.
–శీరంనర్సింహమూర్తి, బీసీనాయకుడు, నక్కపల్లి
చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధం చేయాలి
బీసీలకు క్షమాపణ చెప్పాలి


