అచ్చెరువు గొలిపే చిత్తరువు | - | Sakshi
Sakshi News home page

అచ్చెరువు గొలిపే చిత్తరువు

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

● చోడవరంలో అబ్బుపరిచిన చిత్ర ప్రదర్శన

● యువ చిత్రకారుల కుంచె నుంచిజాలువారిన సృజనాత్మక చిత్రాలు

ఆర్ట్‌ గ్యాలరీ ప్రదర్శనలో ఉంచిన చిత్రాలు

చోడవరం: ఒక చిత్రం వెయ్యి మాటలతో సమానం. మానవ భావోద్వేగాలను చరిత్రను ప్రకృతి అందాలను మన కళ్లముందు ఉంచుతుంది. అలాంటిది వందలాది చిత్రాలు ఒకే చోట ప్రదర్శనగా ఉంచితే ... ఆ కళ్లు బాపురే అనిపిస్తాయి. అలాంటి ఎన్నో అందమైన చిత్రాల ప్రదర్శనకు చోడవరం వేదికై ంది. ఇక్కడి చిత్రకళా నిలయం నిర్వాహకుడు బొడ్డేడ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రేమ సమాజం ఆవరణలో చిత్ర ప్రదర్శనను ఆదివారం ఏర్పాటు చేశారు. ఇవి చూపరులను ఆలోచింపచేస్తూ.. ఆకట్టుకుంది. ఎన్నో సృజనాత్మక చిత్రాలు, సంఘాన్ని మేల్కొల్పే బొమ్మలు, ఎందరో చిత్రకారుల చేతి నుంచి జాలువారిన మరెన్నో అందమైన ఊహాచిత్రాలు అందర్నీ కట్టిపడేసి ఔరా..అనిపించాయి. ఈ చిత్ర కళాప్రదర్శనను ఎమ్మెల్యే రాజు, నన్నయ్య యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ బి.రామ్‌నరేష్‌తో పాటు అనేక మంది తిలకించారు. నేటితరం యువ చిత్రకారులు బొమ్మలు వేసి ఈ ప్రదర్శనలో ఉంచడం చూపరులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ఉత్తమ బొమ్మలు వేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫోరం ఫర్‌ బెటర్‌ చోడవరం ప్రతినిధులు ఆర్క్‌ ప్రసాద్‌, దేముడు మాస్టారు, పి. తిరుపతిరావు, ప్రేమ సమాజం మేనేజర్‌ ప్రసాద్‌ రాజు, చిత్ర పరిషత్‌ జిల్లా కార్యదర్శి సుంకర చలపతిరావు, యల్లపు కళాసాగర్‌, డాక్టర్‌ విజయ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement