నిషేధిత భూములపై న్యాయపోరాటం | - | Sakshi
Sakshi News home page

నిషేధిత భూములపై న్యాయపోరాటం

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

● ప్రభుత్వంతో పోరాడి రోల్‌ బ్యాక్‌ 22ఏ సాధించుకుందాం ● ‘సెంట్రల్‌ ఫర్‌ లిబర్టీ’ ఆస్తి హక్కుల కేంద్రం వ్యవస్థాపకుడు ఏబీ వెంకటేశ్వరరావు

మహిళపై రియల్టర్ల దాడి

తగరపువలస: స్థల వివాదంలో ఓ మహిళపై రియల్టర్ల దాడి స్థానికంగా కలకలం రేపింది. యాత కుమ్మరిపాలెంకు చెందిన పిల్లి సుజాత అనే మహిళపై ముగ్గురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో పాటు మరో 15 మంది కలిసి దాడి చేయడంతో పాటు దుస్తులు చింపి, అంతు చూస్తామని బెదిరించినట్లు ఆమె భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 3వ వార్డు యాత కుమ్మరిపాలెంలో సర్వే నంబర్‌ 79/2లో సుజాత స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ అనుచరులతో వచ్చి ధ్వంసం చేశారు. ఈ భూ వివాదంపై గతంలో ఇరువర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నెల రోజుల క్రితం ఆమె కుమార్తె మృతి చెందడంతో తీవ్ర దుఃఖంలో ఉన్న సమయంలోనే దాడికి పాల్పడ్డారని సుజాత, శ్రీను దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై భీమిలి పోలీసులు విచారణ చేపట్టి, రెవెన్యూ అధికారుల సహకారం కోరనున్నట్లు తెలుస్తోంది.

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో 22(ఏ) చట్టం కింద 15 లక్షల ఎకరాల ప్రజల భూములు నిరాధారంగా నిషేధిత జాబితాలో చేరుతున్నాయని ‘సెంట్రల్‌ ఫర్‌ లిబర్టీ’ ఆస్తి హక్కుల కేంద్రం వ్యవస్థాపకులు, మాజీ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు బాధితుల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఆదివారం విశాఖ రైల్వే న్యూ కాలనీలోని సుబ్బలక్ష్మీ కల్యాణ మండపంలో ‘సెంట్రల్‌ ఫర్‌ లిబర్టీ’ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భూ బాధితుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం బాధితులతో కలిసి ర్యాలీగా వెళ్లి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22(ఏ) పరిధిలో ఉన్న భూముల్లో అత్యధిక సమస్యలు విశాఖలోనే ఉన్నాయని తెలిపారు. సరైన పత్రాలు ఉన్నప్పటికీ పలువురి భూములను నిషేధిత జాబితాలో చేర్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల్లో అవగాహన కల్పించడమే తమ సంస్థ లక్ష్యమని, ప్రభుత్వ, అసైన్‌మెంట్‌, సర్వీస్‌, ఇనామ్‌, పట్టా భూముల సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని తెలిపారు. నిషేధిత జాబితాలో భూములు చేరాయని ఎవరూ ఆందోళన చెందవద్దని, దళారులను ఆశ్రయించకుండా న్యాయపరంగా పోరాడాలని సూచించారు. రెవెన్యూ అధికారుల్లో అవినీతి పెరిగిపోతోందని ఆరోపించిన ఆయన.. సీఎం ఆదేశాలు ఉన్నా కొందరు అధికారులు వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించాలని కోరారు. రెండున్నరేళ్లుగా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యా దులు చేస్తున్నా 22(ఏ) సమస్యపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 22(ఏ)పై ఆందోళన చేపట్టిందని, ఏపీలో సమస్య మరింత తీవ్రంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

రెవెన్యూ అధికారుల తీరుపై ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం

విశాఖలో రెవెన్యూ అధికారుల అవినీతి, భూ అక్రమాలు పెరిగిపోతున్నాయని ‘సెంట్రల్‌ ఫర్‌ లిబర్టీ’ ఆస్తి హక్కుల కేంద్రం వ్యవస్థాపకులు, మాజీ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. ల్యాండ్‌ గ్రాబ ర్లు, కబ్జాదారులకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని విమర్శించారు.అమాయక ప్రజల భూము లను కాపాడుకోవాలంటే పోరాటం చేయాల్సిందేనని, బాధితులకు తమ కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. దేవదాయ భూముల సమస్యలను సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయాలని, అవసరమైతే లోకాయుక్తను ఆశ్రయించవచ్చని సూచించారు.

జీవోలు అమలైతేనే పరిష్కారం

22(ఏ) సమస్యపై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. నిషేధిత జాబితాలో భూములు చేరాయని ఎవరూ ఆందోళన చెందవద్దని, తమ ఆధీనంలోని భూముల కోసం న్యాయపోరాటం చే యాలని సూచించారు.ఒక గ్రామం.. నాలుగు పర్యటనలతో ఫ్రీ హోల్డ్‌ భూముల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించినా పురోగతి కనిపించడం లేద న్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయకపోతే జీవోలు కాగితాలకే పరిమితమవుతాయని వ్యాఖ్యానించారు.కార్యక్రమంలో ‘సెంట్రల్‌ ఫర్‌ లిబర్టీ’ ఆస్తి హక్కుల కేంద్రం సహ వ్యవస్థాపకులు చక్రవర్తి, అజయ్‌ మల్లారెడ్డి, ప్రతినిధు లు జితేంద్ర, డాక్టర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement