కేంద్ర, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా 1న చలో ఢిల్లీ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా 1న చలో ఢిల్లీ

Sep 28 2026 12:53 AM | Updated on Sep 28 2026 12:53 AM

దేవరాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ డిసెంబర్‌ 1న చేపట్టనున్న ‘ఛలో డిల్లీ పార్లమెంట్‌ మార్చ్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. దేవరాపల్లిలో వివిధ కార్మిక సంఘాలు, స్కీమ్‌ వర్కర్లతో ఆదివారం సిఐటీయూ మండల కార్యదర్శి బి.టి.దొర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్రానికి కనువిప్పు కలిగేలా అధిక సంఖ్యలో ప్రజలు, కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు తరలిరావాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని పాలకులు కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశ రాజధాని వేదికగా సాగే ఈ నిరసన ప్రదర్శనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, హక్కుల సాధన కోసం ఢిల్లీ వైపు కదిలి రావాలని కోరారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను పర్మనెంట్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కె.సూరిబాబు, జి.రాము, మేరీ రత్నం, ఎస్‌. మహలక్ష్మి, కె.లక్ష్మి,, రమణమ్మ, కోటిబాబు, కొండబాబు, గణేష్‌, లక్ష్మీ తదితర స్కీమ్‌, ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, యూనియన్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement