సముద్ర సహకారానికి మరో ముందడుగు | - | Sakshi
Sakshi News home page

సముద్ర సహకారానికి మరో ముందడుగు

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

సింథియా(విశాఖ): ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నౌక షౌనక్‌ సెప్టెంబర్‌ 25న క్వాడ్‌ ఎట్‌ సీ షిప్‌ అబ్జర్వర్‌ మిషన్‌ కోసం చైన్నె నుంచి బయలుదేరింది. క్వాడ్‌ సభ్య దేశాలకు చెందిన ఆరుగురు సముద్ర పరిశీలకులు ఈ మిషన్‌లో పాల్గొంటున్నారు. భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరి కా దేశాల మధ్య సముద్ర సహకారం, సమన్వ యం, పరస్పర సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ మిషన్‌ కీలక పాత్ర పోషించనుంది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో సురక్షిత, స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత సముద్ర వాతావరణాన్ని ప్రోత్సహించడంతోపాటు భారతదేశ మహాసాగర్‌ దృక్పథాన్ని ఈ మిషన్‌ మరింత బలోపేతం చేస్తుందని నేవీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement