హెచ్చరిక బోర్డు పీకేసిరోడ్డు ఆక్రమణ | - | Sakshi
Sakshi News home page

హెచ్చరిక బోర్డు పీకేసిరోడ్డు ఆక్రమణ

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

బుచ్చెయ్యపేట: మండలంలోని సీతయ్యపేట జగనన్న కాలనీ రోడ్డును స్థానికుడు ఆక్రమించాడు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఇక్కడ జెడ్పీ హైస్కూల్‌ను ఆనుకుని జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. సీతయ్యపేట, చింతపాక గ్రామాలకు చెందిన 62 మందికి ఇక్కడే లే అవుట్‌ వేశారు. ఇళ్ల స్థలాలకు వెళ్లే రహదారిని స్థానికుడు దున్నేసి మొక్కలు నాటాడు. గతంలో ఇతను ఇదే స్థలాన్ని ఆక్రమించగా, రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి కాలనీకి వెళ్లే రహదారిలో మొక్కలు నాటడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి భూ ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement