గాయపడిన కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

గాయపడిన కార్మికుడు మృతి

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

రాంబిల్లి: సెజ్‌లో సీతపాలెం సమీపంలో గల సన్వీరా కంపెనీలో గాయపడి చికిత్స పొందుతూ కాంట్రాక్టు కార్మికుడు షరీఫ్‌ అన్సారీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం సన్వీరా కంపెనీలో 12 అడుగుల ఎత్తులో నున్న భవనం పై నుంచి ఐరన్‌ షీట్లును తొలగిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐరన్‌ షీట్లు కట్టిన తాడు తెగిపోవడంతో షరీఫ్‌ అన్సారీ, అఫ్రోజ్‌ అలీమ్‌లు కింద పడి తీవ్ర గాయలపాలయ్యారు. వీరిని అచ్యుతాపురంలో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం షరీఫ్‌ అన్సారీను వేరే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగేంద్ర తెలిపారు. కాగా అఫ్రోజ్‌ అలీమ్‌కు కంటి కింది భాగంలో ఫ్యాక్చర్‌ అయిందన్నారు. వీరు దుర్గా భవానీ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ లో ఈ ఏడాది జూన్‌ నుంచి పనిచేస్తున్నారని తెలిపారు.తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మృతుడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement