నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు

Sep 23 2026 12:31 AM | Updated on Sep 23 2026 12:31 AM

● మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యం ● కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి : జిల్లాలోని యువతకు, మహిళలకు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం రేనూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి సంబంధించిన అవగాహన ఒప్పంద ప్రతాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని యువతకు, మహిళలకు పరిశ్రమలకు అనుగుణమైన సాంకేతిక, ఉద్యోగ నైపుణ్యాలపై శిక్షణ అందిస్తారని, మొదటి దశలో 300 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అచ్యుతాపురంలో ఏపీఐఐసీకి చెందిన వన్‌స్టెఫ్‌ సెంటర్‌లో శిక్షణ కార్యక్రమం అక్టోబర్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వారు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించడమే కాకుండా, కుటుంబం, సామాజిక అభివృద్ధిలో క్రియాశీలకంగా మారుతారన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వడం ద్వారా నైపుణ్యం–ఉపాధి మధ్య అంతరాన్ని తగ్గించవచ్చన్నారు. కార్యక్రమంలో రేనూ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన సీఈవో సంజయ్‌ వర్గీస్‌, ప్రతినిధులు జితేంద్ర, త్రిభవన్‌, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ పి.కె.పి.ప్రసాద్‌ పాల్గొన్నారు.

హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలి

అనకాపల్లి : విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం జిల్లాలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల రోజువారీ హాజరును అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించి, హాజరు శాతం పెరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, వారిలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సంబంధిత ఎంపీడీఓలతో సమన్వయం చేసుకుని శిథిలావస్థలో ఉన్న, ప్రమాదకరంగా మారిన పాఠశాల భవనాలను గుర్తించి, అవసరమైన చోట్ల వెంటనే డిస్మాంట్లింగ్‌ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్‌ాధ్యన్ని మెరుగుపరచాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో నాగేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement