110 ఏళ్ల రిటైర్డ్ వీఆర్‌ఏ చింతాలు మృతి
దేవరాపల్లి: మండలంలోని ముషిడిపల్లి గ్రామానికి చెందిన శతాధిక వృద్దుడు, రిటైర్డ్ విఆర్‌ఏ ఇనపచప్ప చింతాలు (110) శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు. స్వగ్రామం ముషిడిపల్లిలోనే సుమారు 80 సంవత్సరాల పాటు వీఆర్‌ఏగా (గ్రామ రెవెన్యూ సహాయకుడు)గా సేవలందించారు. వయో భారంతో విధులు నిర్వర్తించలేక తన చిన్నకుమారుడైన అప్పారావుకు తన ఉద్యోగ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఇంటి వద్ద ఉంటున్నారు. వృద్ధాప్యంలోనే ఎవరిపై ఆధారపడకుండా తన పనులను తానే స్వయంగా చేసుకునేవారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందగా ఆదివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.


