కులం పేరుతో దూషించిన కేసులో డీఎస్పీ విచారణ | - | Sakshi
Sakshi News home page

కులం పేరుతో దూషించిన కేసులో డీఎస్పీ విచారణ

Sep 7 2026 12:39 AM | Updated on Sep 7 2026 12:39 AM

గొలుగొండ: మండలంలోని గైరంపేటలో మూడు రోజుల కిందట జరిగిన కొట్లాట, కలంపేరుతో దూషించిన కేసులో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో విచారణ నిర్వహించారు. స్థల వివాదంలో గైరంపేట గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాట చోటు చేసుకోవడంతో బాధితురాలు అనంతలక్ష్మి కృష్ణదేవిపేట పోలీసులకు ఫిర్యాదులు చేశారు. బాధితురాలిని కర్రలతో కొట్టి గాయపరడంతో పాటు కులం పేరుతో దూషించిన కారణంగా కృష్ణదేవిపేట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపై అసలు సంఘటన స్థలంలో ఏం జరిగింది..? ఎందుకు కొట్లాట జరిగింది? అనే విషయాలపై నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు స్వయంగా విచారణ జరిపారు. రెండు వర్గాల నుంచి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో కృష్ణదేవిపేట, గొలుగొండ ఎస్‌ఐలు రుషికేశ్వరరావు, పి. రామారావుతో పాటు బాధితులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement