కోటవురట్ల: విశాఖలో ఈ నెల 22, 23 తేదీలలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కోటవురట్ల మండలం సుంకపూరుకు చెందిన పోలిరెడ్డి శ్యామ్‌కుమార్ పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సులో 11 సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులు, క్రీడా మంత్రులు పాల్గొనగా వారితో కలిసి ప్రసంగించే అవకాశం దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని శ్యామ్‌కుమార్ తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అరుదైన అవకాశం దక్కిందన్నారు. యువజన వ్యవహారాలు, క్రీడలు, అంతర్జాతీయ సహకారం, సంప్రదాయ దేశీయ క్రీడలు, క్రీడా సాంకేతికత, తయారీ రంగాలు, యువతకు లభిస్తున్న ప్రోత్సాహం తదితర అంశాలపై అవగాహన కలిగిందన్నారు.


