విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సెల్ఫ్ సపోర్టింగ్ విధానంలో ఎంబీఏ, ఎంసీఏ పూర్తికాల కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఎ.నాయుడు తెలిపారు. డీసీఎంఎస్‌లో ఎంబీఏ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌కు 40, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌కు 40, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌కు 40 సీట్లు, ఏయూఎస్‌ఐబీలో 120 సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంబీఏ కోర్సులకు వార్షిక ఫీజును రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. ఎంసీఏ కోర్సులో 90 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సుకు వార్షిక ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఏపీ ఐసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మిగిలిన సీట్లను అర్హత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 15 సాయంత్రం 5 గంటల్లోగా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయానికి పోస్టు ద్వారా లేదా స్వయంగా అందజేయాలి. సెప్టెంబర్ 17న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.


