శ్లాబ్‌కూలిన ఘటనపై విచారణ | - | Sakshi
Sakshi News home page

శ్లాబ్‌కూలిన ఘటనపై విచారణ

Aug 25 2026 12:51 AM | Updated on Aug 25 2026 12:51 AM

నక్కపల్లి: స్టీల్‌ప్లాంట్‌ పునరావాస కాలనీలో నిర్మాణంలో ఉన్న రక్షిత మంచినీటి పథకం శ్లాబ్‌కూలిన ఘటనపై అడ్డురోడ్డు ఆర్‌డీవో రామలక్ష్మి సోమవారం పరిశీలించారు. బోదిగల్లం వద్ద నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీలో ఆదివారం రక్షిత మంచినీటి పథకం శ్లాబ్‌ కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. దీనిపై ఆర్‌డీవో ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కాంట్రాక్టర్‌ నిర ్లక్ష్యం, పనులు జరిగిన సమయంలో అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా ఆనేదానిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆర్‌డీవో తెలిపారు.

విచారణకు హోంమంత్రి ఆదేశం

శ్లాబ్‌ కూలిన ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై విచారణ జరిపించాలని మంత్రి ఆదేశించినట్టు టీడీపీ ఇన్‌చార్జి వెంకటేష్‌ తెలిపారు. నాణ్యత లోపించినా, భద్రతాలోపం ఉన్నా అధికారుల పర్యవేక్షణ లేకపోయినా ఉపేక్షించేది లేదని మంత్రి పేర్కొన్నారన్నారు. తక్షణం సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారన్నారు.

కాంట్రాక్టర్‌పై కేసు నమోదు

బోదిగల్లం వద్ద స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసిత పునరావాసకాలనీలో రక్షిత మంచినీటి పథకం స్లాబ్‌కూలి ఇద్దరు కూలీలు గాయపడిన ఘటనకు సంబంధించి పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ జె.మురళి తెలిపారు. ఈ ఘటనలో షేక్‌ అభి, ఆదిశంకర్‌ సత్యనారాయణ గాయపడిన విషయం తెలిసిందే. పనులు జరిగే చోట సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందుకు కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement