అనకాపల్లి: ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. స్టాక్ మార్కెట్, క్రిప్టో ట్రేడింగ్ పేరుతో తక్కువ సమయంలో అధిక లాభాలు, రోజువారీ గ్యారెంటీ ఆదాయం ఇస్తామని నమ్మబలుకుతూ మోసగాళ్లు బాధితులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. సాధారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు బదులుగా అనుమానం రాకుండా ఉండేందుకు ‘బోన్‌చార్జ్’వంటి ప్రత్యేక మెసేజింగ్ యాప్‌ల ద్వారా మాత్రమే సంప్రదిస్తారని వెల్లడించారు. స్థానికంగా సెమినార్లు, రిక్రూట్‌మెంట్ మీటింగ్‌లు నిర్వహిస్తూ, రెఫరల్ బోనస్‌ల ఆశ చూపించి స్నేహితులు, బంధువుల ద్వారా నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ తరహా మోసాలపై సమీప పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. బాధితులు తక్షణమే 1930 ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలిపారు.


