ఎట్‌ హోమ్‌కు రాంబాబు మాస్టారు | - | Sakshi
Sakshi News home page

ఎట్‌ హోమ్‌కు రాంబాబు మాస్టారు

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

నాతవరం: మండలంలోని చమ్మచింతలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న అప్పన రాంబాబుకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ కార్యాలయంలో నిర్వహించే ఎట్‌ హోమ్‌ (తేనేటి విందు)కు ఆహ్వానం అందింది. 2007 నుంచి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాంబాబు 2014లో వృక్ష మిత్ర సమితి ఏర్పాటు చేశారు. నాటి నుంచి తన జీతంలో కొంత మొత్తంతో మొక్కలు నాటడం ప్రారంభించారు. నర్సీపట్నం డివిజన్‌లో ఇంతవరకు 2 లక్షలు మొక్కలు నాటారు. గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవలకుగాను కలెక్టర్లు, ఎస్పీలు, విద్యా శాఖ అటవీ శాఖాధికారులతో పురస్కారాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ కార్యాలయం నుంచి ఆహ్వానం రావడంతో డీఈవో, డిప్యూటీ డీఈవో, నాతవరం ఎంఈవోలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కోటి మొక్కలు నాడటమే తన జీవిత ఆఽశయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement