‘రిజర్వాయర్‌ ఆక్రమణపై కలెక్టర్‌ విచారణ చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘రిజర్వాయర్‌ ఆక్రమణపై కలెక్టర్‌ విచారణ చేయాలి’

Aug 15 2026 1:04 AM | Updated on Aug 15 2026 1:04 AM

రావికమతం: కల్యాణపులోవ రిజర్వాయర్‌ పీటీఎల్‌ ప్రాంతంలో భూ ఆక్రమణపై విచారణ పారదర్శకంగా ఉండాలని ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ కల్యాణ్‌, గిరిజనులు డిమాండ్‌ చేశారు. త్రిసభ్య కమిటీకి బదులుగా తహసీల్దార్‌, మండల సర్వేయర్‌, వీఆర్వో హాజరై ప్రజా సంఘాలకు సమాచారం ఇవ్వకుండా స్థానికులను దగ్గరకు రానివ్వకుండా విచారణ చేయడంపై శుక్రవారం వీరు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పారదర్శకంగా విచారణ చేపట్టకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. రిజర్వాయర్‌ను రక్షించుకునే బాధ్యత 14 గ్రామాల రైతులకు ఉందన్నారు. కలెక్టర్‌ వచ్చి పారదర్శకంగా విచారణ చేయాలని ఆదివాసీ నాయకులు కొత్తెం అప్పారావు, తుర్రే రవి తదితరులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement